బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‌‘గబ్బర్‌ సింగ్’చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొత్త పోస్టర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరుమోతు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ని రూపొందించారు. ఇక ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘మిరపకాయ్’ వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ ‌శంకర్ ‘గబ్బర్ ‌సింగ్’ చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ ‌శంకర్. పవన్ ‌కళ్యాణ్‌తో ‘తీన్ ‌మార్’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గణేష్‌ బాబు ఈ ‘గబ్బర్ ‌సింగ్’ చిత్రాన్ని నిర్మించటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.