బొత్స సత్యనారాయణ ప్రోత్సాహంతోనే, పవన్ కళ్యాణ్ హీరోగా ‘తీన్ మార్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత గణేష్. ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్స్ నే సంపాదించి పెట్టింది. అయితే ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా నిర్మించే భాద్యతలను పవన్, గణేష్ కు అప్పగించేస్తాడు. అయితే వరుసగా రెండో చిత్రానికి కూడా నిర్మితగా వ్యవహరిస్తున్న గణేష్ త్వరలో పవన్ తో మూడో చిత్రం కూడా చేయాలని ఆశపడుతున్నాడంట..



అయితే గణేష్ ని నిర్మాతగా ప్రోత్సహించిన బొత్స సత్యనారాయణ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని గణేష్ భావిస్తున్నాడట. ఈ బొత్స పాత్రలో పవన్ తో చేయించాలని గణేష్ ఆశీస్తున్నట్టు తెస్తుంది. సాదా సీదా కుంటుంబంలో జన్మించిన బొత్స, ఏవిధంగా రాజకీయనాయకుడిగా ఎదిగాడు అనే అంశంతో ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో గణేష్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయం నిజమైతే..ఈ చిత్రానికి కథ, మాటలు కూడా బొత్స సత్యనారాయణనే అవడం ఖాయమని సినీవర్గాల వారి అభిప్రాయం..