వేగంగా సినిమాలు చేయాలనే కోరిక ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల వెంటవెంటనే చేయలేకపోతున్న చరణ్ కి ఇప్పుడు ఇంట్లోనే ప్రెజర్ ఎక్కువయింది. ఇంతకాలం తాపీగా సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ వాయు వేగంతో షూటింగ్స్ చేయడం, తెల్లవారుఝామునే సెట్స్ కి వెళుతూ తన వంతుగా షూటింగ్ సకాలంలో పూర్తి కావడానికి దోహదపడుతూ ఉండడంతో కుర్రాడైన చరణ్ పై ఒత్తిడి పెరుగుతోంది.


వయసులో పవన్ అంత కష్టపడుతుంటే యువకుడైన నువ్వెంత కష్టపడాలంటూ ఎవరికి వారే సలహాలు ఇస్తూ ఉండడంతో ఏకకాలంలో మూడు సినిమాలకి అంగీకారం తెలిపాడు. అయితే చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడమనేది ఇప్పుడు అతనిపై ఉన్న పెద్ద భారం. డే అండ్ నైట్ పని చేస్తే తప్ప 2012లోపు మూడు సినిమాలు పూర్తయ్యే అవకాశం లేదు.

తలచుకుంటే ఎంత పెద్ద స్టార్ అయినా మూడు, నాలుగు నెలల్లోనే ఒక సినిమా పూర్తి చేయగలడని పవన్ లైవ్ ఎగ్జాంపుల్ గా నిలిచేసరికి చరణ్ కి ఇప్పుడు సాకులు చెప్పడానికి కూడా స్కోప్ లేదు. చరణ్ ఫీలింగ్ ఎలా ఉన్నా కానీ వేగంగా సినిమాలు చేయడానికి మెగా హీరోలు పోటీ పడుతూ ఉండడం వారి అభిమానులకి మాత్రం ఆనందాన్నిస్తోంది.